నేటి సాయంత్రానికి భవిష్యత్తు కార్యాచరణ – ఎంపి రాయపాటి

0
46
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – గుంటూరు
నరసారావుపేట పార్లమెంట్‌ స్థానంపై టిడిపి అధిష్టానం నుండి ఎటువంటి హామీ రాకపోవడంపై ఎంపీ రాయపాటి అసంతృప్తిగా ఉన్న సంగతి విదితమే.దీనిపై ఆయన స్పందిస్తూ నరసరావుపేట ఎంపీ టికెట్ విషయంలో తనకంటే సమర్థులు ఎవరున్నా రని ప్రశ్నించారు. ఒకవేళ ఉన్నట్లయితే వారికే టికెట్‌ ఇవ్వొచ్చని అన్నారు.

దీంతో ఆయన అనుచరులు, అభిమానులతో తన నివాసంలో గురువారం సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు. టికెట్‌ ఇస్తే మళ్లీ పోటీ చేస్తానని వెల్లడించారు. అయితే, తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ఖండిం చారు. తనకు సీఎం చంద్రబాబుపై పూర్తి నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు.

నరసరావుపేట ఎంపీ సీటుపై భరోసా ఇవ్వలేదని ఆలోచిస్తామని సీఎం చెప్పారని రాయపాటి అన్నారు. తనతో ఏ పార్టీ సంప్ర దింపులు జరపలేదని, వైకాపా నేతలు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారని చెప్పారు. టికెట్‌ రాకపోతే సాయంత్రా నికి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.