తెదేపాకు గుడ్‌ బై చెప్పిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు

0
22
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – తూర్పు గోదావరి
ప్రత్తిపాడు సిట్టింగ్‌ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.దీంతో తూర్పు గోదావరి జిల్లాలో టిడిపికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అయితే సుబ్బారావు 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచి.. ఆ తర్వాత టీడీపీలోకి చేరారు.

అయితే అధికార పార్టీలో చేరిన సుబ్బారావు అక్కడ తగిన ప్రాధాన్యం దక్కలేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. గురు వారం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన సుబ్బారావు టీడీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయ న టీడీపీ తనకు చేసిన అన్యాయాన్ని చెబుతూ కంటతడి పెట్టుకున్నారు.

అయితే సుబ్బారావు వైఎస్సార్‌ సీపీలో చేరాలని పలువురు కార్యకర్తలు ఆయనపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇప్పటికే ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ కుటుంబం కూడా టీడీపీకి గుడ్‌ బై చెప్పి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.