టీకాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ- టీఆర్‌ఎస్‌లో చేరనున్న మరో ఎమ్మెల్యే

0
12
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మరో ఎమ్మెల్యే కాంగ్రెస్‌ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలు స్తోంది.దీంతో టీకాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో తుమ్మల నాగేశ్వరరావుపై గెలుపొందిన కందాళ ఉపేందర్‌ రెడ్డి తెరాస గూటికి చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం.

గురువారం ఆయన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు. గత కొంతకాలంగా తెరాస నేతలు ఉపేందర్‌ రెడ్డితో టచ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్‌ను వీడి తెరాసలో చేరాలని నిర్ణయించుకు న్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ తిరిగి సీటు ఇస్తామన్న హమీ ఉపేందర్‌ రెడ్డికి లభించినట్టు సమాచారం.

దీంతో త్వరలోనే ఆయన తెరాసలో చేరే అవకాశం కనబడుతోంది. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెరాస బీ ఫారంపై పోటీచేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.గత కొంత కాలంగా కాంగ్రెస్‌ నుంచి తెరాసలోకి వలసలు కొనసాగుతున్నా యి.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ వేగం మరింత పుంజుకుంది. ఇటీవల కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగ కాంతారావు, హరిప్రియా నాయక్‌, చిరుమర్తి లింగయ్య తెరాసలో చేరగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు కార్తీక్‌ రెడ్డి సైతం తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నారు.