టిడిపికి బిగ్ షాకిచ్చిన ఎం.పి. మాగంటి శ్రీనివాసులురెడ్డి -వైకాపాలో చేరికకు నిర్ణయం

0
33
advertisment

మనఛానల్ న్యూస్ – ఒంగోలు
తెలుగుదేశం పార్టీకి మూడు రోజులుగా ఆ పార్టీ నేతలు అనేక మంది పార్టీ వీడి వైకాపా వైపు వలసబాట పట్టారు. ఈ పరంపరలో గురువారం తెలుగుదేశం పార్టీ ఒంగోలు ఎం.పి మాగంటి శ్రీనివాసులురెడ్డి పార్టీకి రాజీనామా చేసి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకొన్నారు.

ఈమేరకు ఆయన గురువారం సాయంకాలం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని ప్రకటించడంతో ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాకిచ్చినట్లు అయింది. ఇప్పుటికే జిల్లాలో  చీరాల టిడిపి ఎం.ఎల్.ఎ ఆమంచి కృష్ణ మెహన్ పార్టీ మారారు. ఈ పరంపరలో ఒంగోలు ఎం.పి మాగంటి శ్రీనివాసులు రెడ్డి సైతం వైకాపాలోకి రావడంతో తెలుగుదేశం పార్టీకి ప్రకాశం జిల్లాలో గడ్డుకాలం ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.