చిగురుపాటి జయరాం హత్యకేసులో మరో ముగ్గురి అరెస్ట్‌

0
18
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే.ఈ హత్య కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్‌ చేశారు.ఈ కేసుకు సంబంధించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

సిరిసిల్లకు చెందిన అంజిరెడ్డి, కమెడియన్‌ సూర్యప్రసాద్‌, సూర్య అసిస్టెంట్‌ కిషోర్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. జయరాం చనిపోయిన రోజు ఈ ముగ్గురూ అక్కడే ఉన్నారని, మృతదేహాన్ని చూసి కూడా పోలీసులకు సమాచారం

ఇవ్వలేదన్న కారణంతో వీరిని అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. చిగురుపాటి జయరాం హత్యకేసు ఇప్పటికే పలు మలుపులు తిరిగింది.ఈ కేసు విషయమై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.