ఓటరు నమోదుకు రేపే ఆఖరు – ఏపీ ఎన్నికల సీఈవో జీకే ద్వివేది

0
34
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
ఓటరు నమోదుకు రేపటితో గడువుతో ముగియనుందని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేదీ వెల్లడించారు.ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులు ఎన్నికల అనంతరం పరిశీలించి ఓటర్ల జాబితాలో చేరుస్తామని ఆయన వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించబోమని స్పష్టంచేశారు. ఓటు ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ఓటరుపైనే ఉందన్నారు.

అనేక మాధ్యమాల ద్వారా ఓటరు నమోదు, తనిఖీకి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ స్థాయిలో ఓట్లు పెరిగేందుకు ప్రజలతో పాటు అన్ని వర్గాల కృషి ఉందన్నారు. ఆన్‌లైన్‌లో సర్వర్‌ డౌన్‌ అయితే ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయ వచ్చని తెలిపారు. ఓటర్ల నమోదులో ఏపీ వెనుకబడి ఉందన్న వాదనలు సరికాదని చెప్పారు.

ఓటరు నమోదులో ఏపీ అన్ని రాష్ట్రాలతో సమాన స్థాయిలోనే ఉందని చెప్పారు. 7.9 శాతం వరకూ ఓటర్లు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఏపీలో ఓటర్ల సంఖ్య 3.95 కోట్లకు చేరే అవకాశం ఉందని తమకు అంచనా ఉందన్నారు. జనవరి 11కు ముందు 20లక్షల కొత్త ఓట్లు జాబితాలో చేర్చామని తెలిపారు. ఈ నెల 25 తర్వాత మరో 20లక్షలకు పైగా ఓట్లు పెరిగే అవకాశముందన్నారు.

                             more Details Pls visit OUR website: https://chennaisamirta.com/