ఆసక్తికర విషయాలను వెల్లడించిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర యూనిట్‌

0
24
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – సినిమా డెస్క్‌
దర్శకధీరుడు రాజమౌళి, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌,యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్‌ టాలీవుడ్‌ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌.ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు తెలియజేయడానికి చిత్రయూనిట్ మీడియా సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి సినిమా కథా కథనాలు, నటీనటుల విశేషాలను వెల్లడించారు.

ఆర్‌ఆర్ఆర్‌ 1920లో ఉత్తర భారతదేశంలో జరిగే కథగా తెరకెక్కిస్తున్నట్టుగా వెల్లడించారు రాజమౌళి. స్వాతంత్ర్య సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీంలు ఒకే సమయంలో కలిసి పోరాటం చేసి ఉంటే ఎలా ఉండేది అన్న ఫిక్షనల్‌ పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా వెల్లడించారు రాజమౌళి. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ సీతా రామరాజుగా, ఎన్టీఆర్‌ కొమరం భీం కనిపించనున్నారు.

భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌ ఓ కీలకపాత్రలో నటిస్తున్నారని తెలిపారు. ఫ్లాష్‌ బ్యాక్‌లో వచ్చే పవర్‌ఫుల్‌ పాత్రలో అజయ్‌ కనిపించనున్నారు. ఇక చరణ్‌కు జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్ నటిస్తు న్నారని, ఎన్టీఆర్‌కు జోడిగా విదేశీ భామ కనిపించనున్నారని వెల్లడించారు.

మరో కీలక పాత్రలో తమిళ నటుడు సముద్రఖని నటిస్తున్నారు. 2020 జూలై 30న తెలుగు, హిందీ, తమిళ, మళయాల భాషలతో పాటు దాదాపు 10 భారతీయ భాషల్లో ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్టుగా నిర్మాత దానయ్య తెలిపారు.