ఆఖరి వన్డేలో భారత్‌కు భంగపాటు – సిరీస్‌ ఆసీస్‌ వశం

0
12
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
భారత అభిమానులు ఆశించినట్లు ఏమీ జరుగలేదు.చివరి వన్డేలో గెలిచి సిరీస్‌ సొంతం చేసుకుంటుందనుకున్న భారత్‌ జట్టు చేతులెత్తేసింది.ఇప్పటి వరకు 0-2తో వెనుకబడిన వన్డే సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకో వడం ఆసీస్‌కు ఇదే ప్రథమం.బుధవారం దిల్లీలో జరిగిన ఐదో వన్డేలో 35 పరుగుల విజయంతో సిరీస్‌ను ఎగరేసుకు పోయిం ది.

సొంతగడ్డపై భారత్‌ చేతిలో టెస్టులు, వన్డేల్లో ఓడి పరాభవం మూటగట్టుకున్న కంగారూ జట్టు ఇప్పుడు భారత్‌ను స్వదేశంలో టీ20లు, వన్డేల్లో మట్టికరిపించి ప్రతీకారం తీర్చుకుంది. భీకర ఫామ్‌ కొనసాగిస్తూ ఓపెనర్‌ ఖవాజా (100; 106 బంతుల్లో 10×4, 2×6) సెంచరీ చేయడంతో మొదట 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసిన ఆసీస్‌ భారత్‌ను సరిగ్గా 50 ఓవర్లలో 237 పరుగులకే ఆలౌట్‌ చేసింది.

భువనేశ్వర్‌ (3/48), జడేజా (2/45), షమి (2/57) ఆసీస్‌కు కళ్లెం వేశారు. ఛేదనలో రోహిత్‌ (56; 89 బంతుల్లో 4×4), జాదవ్‌ (44; 57 బంతుల్లో 4×4, 1×6), భువనేశ్వర్‌ (46; 54 బంతుల్లో 3×4, 2×6) పోరాడినా ఫలితం లేకపోయింది. జంపా (3/46), కమిన్స్‌ (2/38), జే రిచర్డ్‌సన్‌ (2/47), స్టాయినిస్‌ (2/31) భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టిపడేశారు. ఖవాజా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’తో పాటు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డుల్ని గెలుచుకున్నాడు.