బి.కొత్తకోటలో ఘనంగా జతీయ పూల మొక్కల దినోత్సవం

0
58
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – బి.కొత్తకోట
బి.కొత్తకోట పట్టణంలోని భవిత కేంద్రం నందు బుధవారం జాతీయ పూల మొక్కల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దీనిని పురస్కరించుకొని దివ్యాంగుల చేతుల మీదుగా పూల మొక్కలను నాటించారు.ఈ సందర్భంగా మొక్కలు, పూల మొక్కలు ప్రకృతి వరాలన్నారు.

వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.పూలు పరిమళాలను వెదజల్లుతాయని, ఆ పరిమళాలతో మాన వాళి పులకిస్తుందన్నారు. మొక్కలు, పూల మొక్కలతోనే మానవాళితో, పక్షులు, జంతువులు మనుగడ కొనసాగుతుంద న్నారు.

ఈ కార్యక్రమంలో ఐఈఆర్‌టి ఉపాధ్యాయులు సురేశ్‌, పోలయ్య,ఎం.ఆర్‌.సి సిబ్బంది రమేష్‌,ఆది,ఉబైదుల్లా మరియు దివ్యాం గ పిల్లలు పాల్గొన్నారు.