తన సోదరి కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్‌

0
12
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
నిజామాబాద్‌ ఎంపి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం నేడు.ఈ సందర్భంగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తన సోదరి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎనర్జీకి, డైనమిజానికి చిరునామా అయిన నా చెల్లి కవితకు జన్మదిన శుభాకాంక్షలు.

నువ్వు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని, ప్రజా సేవలో సుదీర్ఘకాలం కొనసాగాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నా నని కేటీఆర్‌ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కవితతో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్నారు. కాగా కవిత టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకలాపాల్లో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నారు.

పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతూ ముందుకు సాగుతున్నారు.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ మహిళా కార్యకర్తలు మరియు ఆమె అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.ఇలాంటి జన్మదినాలు ఆమె మరిన్ని జరుపుకోవాలని పులు వురు ఆకాంక్షించారు.