ఫలించిన నాయకులు చర్చలు – కాంగ్రెస్‌లోనే కొనసాగనున్న సబితా

0
8
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
మాజీ హోమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి తెరాసలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారానికి కాంగ్రె స్‌ నాయకులు తెరదించారు.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రతి పక్ష నేత భట్టి విక్రమార్క, జానారెడ్డి, సుధీర్ రెడ్డిలు రెండు రోజుల క్రితం చర్చలు జరిపారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో సుధీర్ఘంగా చర్చించారు.

ఇదే సమయంలో ఇతర ముఖ్య నాయకులతో మాట్లాడించారు. కాంగ్రెస్ పార్టీలో అనేక కీలక పదవులు అలంకరించిన ఆమెను పార్టీ వీడకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.చివరకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఫోన్లో మాట్లాడించారు. అమె ను దిల్లీ రావాలని రాహుల్ ఆహ్వానించారు. దిల్లీకి వస్తే అన్ని విషయాలు మాట్లాడదామని చెప్పడంతో సబితా మెత్తబడ్డారు.

ఇవాళ సాయంత్రం రేవంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్‌రెడ్డిలు దిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. అదేవిధంగా లోక్‌సభ అభ్య ర్థుల ఎంపికపై రేపు ఏఐసీసీ స్టీరింగ్ కమిటీ సమావేశం కానుంది. ఆ సమావేశంలో పాల్గొనేందుకు ఈ సాయంత్రం దిల్లీకి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి,శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క ఇతర సీనియర్ నాయకులు వెళ్లనున్నారు.