ప్రిన్స్‌ మహేష్‌ సరసన బాలీవుడ్‌ నటి సోనాక్షీ సిన్హా…?

0
14
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – సినిమా డెస్క్‌
యువ దర్శకుడు అనిల్‌ రావిపూడితో ప్రిన్స్‌ మహేష్‌ బాబు ఓ సినిమా చేయబోతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగు తోంది. ప్రస్తుతం మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్న మహేష్ ఆ సినిమా పూర్తయిన వెంటనే అనిల్‌ రావిపూడి సినిమాను పట్టాలెక్కించే ఆలోచన ఉన్నారన్న టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్‌గా చాలా మంది తారల పేర్లు తెర మీదకు వస్తున్నాయి.

ముందుగా మహేష్‌కు జోడిగా సాయి పల్లవి నటిస్తుందన్న టాక్‌ వినిపించింది, తరువాత రష్మిక పేరు తెర మీదకు వచ్చింది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఓ బాలీవుడ్ బ్యూటీ పేరును పరిశీలిస్తున్నారన్న వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. మహేష్‌ సరసన హీరోయిన్‌గా సోనాక్షి సిన్హాను తీసుకునే ఆలోచనలో ఉన్నాడట అనిల్ రావిపూడి.

గతంలో క్రిష్ దర్శకత్వంలో మహేష్‌, సోనాక్షిలు హీరో హీరోయిన్లుగా ఓ సినిమా రూపొందనుందటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. మరి అనిల్‌ సినిమాతో అయిన ఈ జంట అభిమానులను అలరిస్తుందేమో చూడాలి.