తెలంగాణలో శాసనమండలి ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

0
7
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
శాసనసభ్యుల కోటాలో ఐదు శాసనమండలి స్థానాలకుగాను తెలంగాణలో మంగళవార ఉదయం ఎన్నికల పోలింగ్‌ ప్రారంభ మైంది. పోలింగ్‌ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కిం పు ప్రక్రియ ప్రారంభమవుతుంది.

కాంగ్రెస్‌ పోటీలో లేనందున ప్రథమ ప్రాధాన్య క్రమంలోనే తెరాస, మజ్లిస్‌ సభ్యులు గెలవడం ఖాయమైంది. మండలి ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్‌ అధికారి వి.నరసింహాచార్యులు తెలిపారు.ఈ ఎన్నికలకు సంబంధించి ఆది నుంచి అనూహ్య పరిణామాలు సంభవిస్తున్నాయి.

అయిదు స్థానాలకుగాను తెరాస నాలుగింట పోటీ చేస్తూ, ఒక స్థానాన్ని మిత్రపక్షమైన మజ్లిస్‌కు కేటాయించింది. కాంగ్రెస్‌ కూడా అభ్యర్థిని బరిలోకి దింపింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు తెరాసలో చేరుతున్నట్టు ప్రకటించడంతో పోలింగుకు ఒక రోజు ముందు కాంగ్రెస్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది.