వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఇంగ్లండ్‌

0
7
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను గెలిచి, వన్డే సిరీస్‌ను సమం చేసిన వెస్టిండీస్‌ మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో చేతులెత్తేసింది.దీంతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్‌కు గురైంది.రెండో టీ20లో 45 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్‌, మూడో టీ20లో సైతం అదే ఒరవడిని కొనసాగించింది.

ఇంగ్లండ్‌ బౌలర్లు విజృంభించడంతో 13 ఓవర్లలో కేవలం 71 పరుగులకే వెస్టిండీస్‌ కుప్పకూలింది.క్యాంప్‌ బెల్‌ 11, హోలడర్‌ 11, పూరన్‌ 11, మెక్‌కోయ్‌ 10 పరుగులు మాత్రమే రెండంకెలల స్కోరును సాధించారు. ఇక ఇంగ్లండ్‌ బౌలలర్లలో డేవిడ్‌ విల్లే 4, మార్క్‌ ఉడ్‌ 3, రషీద్‌ 2 వికెట్లను పడగొట్టారు.

అనంతరం 72 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. బెయిర్‌ స్టో 37, హేల్స్‌ 20 పరుగులతో రాణించారు.ఇక డేవిడ్‌ విల్లే మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌, క్రిస్‌ జోర్డాన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ పురస్కారాలను దక్కించు కున్నారు.