ప్రశాంతంగా మూవీ ఆర్టీస్ట్ అసోషియేషన్ ఎన్నికలు

0
52
advertisment

మనఛానల్ న్యూస్ – హైదరబాద్
హైదరబాద్ లోని తెలుగు సినిపరిశ్రమకు చెందిన సినీ నటుల సంఘం (మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (మా))ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. సినీ నటులు నరేష్, శివాజీ రాజాలు ఈ ఎన్నికలలో పోటి చేస్తున్నారు. సుమారు 800 మంది సినీ నటులు సభ్యులుగా ఉన్న మా అసోషియేషన్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల మాదరి గా ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి.

ప్రధాన నటులు చిరంజీవి, నాగార్జున, రాజశేఖర్, జీవిత, ఎస్.వి.కృష్ణారెడ్డి,పరుచూరి బ్రదర్స్ మెుదలైనవారు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. మద్యాహ్నం 2గంటలకు పోలింగ్ పూర్తి అవుతుంది. అనంతరం కౌంటింగ్ ప్రారంభమౌతుంది.సాయంకాలానికి తుది ఫలితాలు విడుదల కానున్నాయి.

నరేష్ ప్యానల్ కు హీరో రాజశేఖర్, జీవితాలు మద్దతు ఇస్తున్నారు. శివాజీ రాజా ప్యానల్ కు హీరో శ్రీకాంత్, దర్శకుడు ఎస్.వి కృష్ణారెడ్డి, నటుడు బెనర్జీలు మద్దతు ఇస్తున్నారు.