విరాట్‌ కోహ్లీ ఓ క్రికెట్‌ కోహినూర్‌ – మథ్యూ హేడెన్‌ ప్రశంస

0
17
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
శతకాల మీద శతకాలు బాదుతూ అనేక రికార్డులలను సృష్టిస్తున్న భారత పరుగులల యంత్రం, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై మాజీ క్రికెట్‌ దిగ్గజాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.కోహ్లీ అద్భుత ఆట‌ను కొనియాడుతూ సోషల్ మీడియాలో మెసేజ్‌లు పోటె త్తుతున్నాయి.

ఆస్ట్రేలియాతో శుక్ర‌వారం జ‌రిగిన మూడో వన్డేలో కోహ్లీ ఆట‌తీరును సామాన్యులే కాకుండా మాజీ ఆట‌గాళ్లు సైతం ప్ర‌శంసిస్తు న్నారు.ఆస్ట్రేలియా మాజీ ఓపెన‌ర్‌, దిగ్గ‌జ ఆట‌గాడు మాథ్యూ హెడెన్ కూడా కోహ్లీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. కోహ్లీ ఒక అద్భుత‌మ‌ని కొనియాడాడు. నేను గ‌త జ్ఞాప‌కాల‌ను గుర్తుకు తెచ్చుకుంటున్నా. బ్రియాన్ లారా, స‌చిన్ టెండూల్క‌ర్ మొద‌ లైన దిగ్గ‌జ ఆట‌గాళ్లంతా ఒక్కొక్క స‌మ‌యంలో గొప్ప ఆటతీరు ప్ర‌ద‌ర్శించారు.

కానీ, కోహ్లీ మాత్రం చాలా సుల‌భంగా అన్ని ఫార్మాట్ల‌లోనూ అద‌ర‌గొడుతున్నాడు. శుక్ర‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు క‌ష్ట‌మైన పిచ్‌పై అత‌డి ఆట‌తీరు అద్భుతం. అత‌డి బ్యాటింగ్ చూస్తుంటే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందేమో అనిపించింది. మైదానానికి న‌లువైపులా మంచి షాట్లు కొట్టాడు. మ్యాచ్‌ను గెలిపించ‌డానికి శాయ‌శ‌క్తులా కృషి చేశాడ‌ని హెడెన్ అన్నాడు.