రెండో టీ20లో ఇంగ్లాండ్‌ చేతిలో చిత్తుగా ఓడిన వెస్టిండీస్‌

0
11
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
టీ20 మ్యాచులనగానే క్రికెట్‌ ప్రేమికులకు గుర్తొచ్చేది వెస్టిండీస్‌ జట్టు. తన ఖాతాలో రెండు టీ20 ప్రపంచకప్‌ను వేసుకుంది. అలాంటి అరవీర భయంకరమైన జట్టు తాజాగా టీ20 చరిత్రలో ఘోరపరాభావాన్ని మూటగట్టుకుంది.ఇంగ్లాండ్‌తో జరుగు తున్న మూడు టీ20 సిరీస్‌లో భాగంగా సెయింట్‌ లూసియాలో జరిగిన రెంటో టీ20లో ఆ జట్టు నిర్ధేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో కరీబియన్‌ జట్టు 45 పరుగులకే కుప్పకూలింది.

దీంతో 137 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసి ఇంగ్లండ్‌కు టీ20 సిరీస్‌ను అప్పగించింది. టీ20 చరిత్రలోనే ఇది రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. గతంలో పసికూన నెదర్లాండ్‌ను శ్రీలంక 39 పరుగులకే ఆలౌట్‌ చేసింది. అయితే టెస్టు జట్టు హోదాలేని నెదర్లాండ్‌ చేసిన చెత్త ప్రదర్శన కన్నా టీ20 డిఫెండింగ్‌ చాంపియన్‌ విండీస్‌ తాజా ప్రదర్శనే అతి ఘోరమై నదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ఇంగ్లండ్‌కు శుభారంభం అందలేదు. అయితే జోయ్‌ రూట్‌(55) బాధ్యాతయుతంగా ఆడాడు. చివర్లో బిల్లింగ్స్‌ (87; 47 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్కర్లు) బ్యాట్‌ ఝుళీపించడంతో ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 182 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ జట్టు ఘోరంగా తడబడింది.

క్రిస్‌ జోర్డాన్‌(4/6), విల్లే(2/18), రషీద్‌(2/12), ప్లంకెట్‌(2/8)లు కరేబియన్‌ పతనాన్ని శాసించారు. ఇంగ్లండ్‌ బౌలర్ల ధాటికి హెట్‌మేర్‌(10), బ్రాత్‌వైట్‌(10)లు తప్ప ఏ ఒక్క బ్యాట్స్‌మెన్‌ కూడా రెండంకెల స్కోర్‌ చేయలేకపోయారు. దీంతో 11.5 ఓవర్లలో 45 పరుగులకే ఆలౌటై విండీస్‌ ఘోర ఓటమి చవిచూసింది.