ఆర్య సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్న శింబు…

0
29
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – సినిమా డెస్క్‌
విభిన్న, వైవిధ్యభరిత పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కోలీవుడ్‌ హీరో శింబు.గెలుపోటముల గురిం చి ఏ మాత్రం పట్టించుకోకుండా తనదైన దారిలో పయనిస్తున్నారు శింబు.

వెంకట్‌ప్రభు దర్శకత్వంలోని ‘మానాడు’లో నటించడానికి కొన్ని నెలల ముందే కమిట్‌ అయినప్పటికీ ఇంకా కాల్షీట్‌ ఇవ్వలే దని సమాచారం. ఇదిలా ఉండగా ఆర్య హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో శింబు విలన్‌ పాత్ర పోషిస్తున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. కన్నడలో విజయం సాధించిన ‘మఫ్టీ’ చిత్రం రీమేక్‌ ఇది అని తెలుస్తోంది.

కన్నడలో శివరాజ్‌కుమార్‌, శ్రీమురళీలు ముఖ్యపాత్రలు పోషించారు. ఇక్కడ ఆర్య, శింబులు నటించనున్నట్లు వార్తలు వినిపి స్తున్నాయి. స్టూడియోగ్రీన్‌ బ్యానరుపై కేఈ జ్ఞానవేల్‌రాజా ఈ సినిమా నిర్మించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.