వై.ఎస్.జగన్ తో ఎం.ఎల్.ఏ దేశాయ్ తిప్పారెడ్డి దంపతుల భేటి – టికెట్ పై క్లారిటీ..!

0
591
advertisment

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
మదనపల్లి అసెంబ్లీ నియోజక వర్గ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ టికెట్ మైనార్టీలకు కేటాయిస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో మదనపల్లి ఎం.ఎల్.ఎ దేశాయ్ తిప్పారెడ్డి శుక్రవారం హైదరాబాద్ లోని లోటస్ ఫాండ్ లో వైకాపా అధ్యక్షుడు వై.ఎస్.జగన్ ను తన సతీమణి దేశాయ్ శైలాజా రెడ్డితో కలిసి భేటి అయ్యారు.

మదనపల్లి టికెట్ విషయంలో జరుగుతున్న ప్రచారం గురించి ఆయన జగన్ దృష్టికి తీసుకొచ్చి తాను పార్టీ కోసం శ్రమిస్తున్నానని ఈ పరిస్థితులలో తనకే టికెట్ కేటాయించాలని కోరినట్లు సమాచారం అందుతోంది. అయితే వై.ఎస్.జగన్ ఈ విషయంలో ఏ విధంగా స్పందించారనేది ఇంకా తెలియలేదు.

అయితే, మదనపల్లి లో వైకాపా టికెట్ మార్చుతారనే ప్రచారం మాత్రం తీవ్రంగా కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగానే మైనార్టీలకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది.అభ్యర్థి ఎవరనేది కూడ టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది.

ప్రస్తుతం మదనపల్లి ఎం.ఎల్.ఎ దేశాయ్ తిప్పారెడ్డి పై వైకాపా లో ద్వితీయ, తృతీయ శ్రేణి కేడర్ లో మాత్రం తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఎం.ఎల్.ఎ తిప్పారెడ్డి తమకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదని బాహటంగా కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

దేశాయ్ తిప్పారెడ్డి పార్టీ కేడర్ తో పాటు మీడియా వర్గాలతో సైతం చాలా పరిమితంగా ఉండడం ఆయనకు పెద్ద మైనస్ గా మారింది. అలాగే నియోజకవర్గంలో పార్టీకి చెందిన మండల స్థాయి ప్రజాప్రతినిధుల విషయంలో సైతం ఆయన ధోరణి విమర్శల పాలు అవుతోంది.

advertisment

పార్టీ కేడర్ తో సఖ్యతగా ఉంటూ ప్రజల మధ్య  ఉన్నప్పుడే  ఏ నాయకుడికైనా గుర్తింపు లభిస్తుంది. మారుతున్న పరిస్థితులకనుగుణంగా నాయకులు రాజకీయాలు చేయడం అలవర్చుకొన్నప్పుడే ఏ నేత అయినా తన కేరీర్ లో విజయం సాధిస్తారనడంలో సందేహం లేదు.