మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వై.ఎస్‌.జగన్‌

0
11
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు.సోదరీమణులందరికీ సెల్యూట్‌ అని తెలిపారు.తల్లి, భార్య, కుమార్తె, సోదరికి నా సెల్యూట్‌ అన్నారు.మీ వల్లనే మేమంతా సంతోషంగా, మనశ్శాంతితో మంచి జీవితాన్ని గడుతున్నామని కితాబిచ్చారు.

మీ గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటామని మేమందరం ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అన్నిరంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో మహిళ లు తమదైన ముద్రవేస్తున్నారని కొనియాడారు.

సమాజంలో స్త్రీలను ప్రతిఒక్కరూ గౌరవించాలని, వారి హక్కులకు ఎటువంటి భంగం కలిగించకూడదన్నారు.మహిళల భద్రత కు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, తద్వారా మహిళలు సగర్వంగా జీవించగలరని ఆయన ట్వీట్‌ చేశారు.