నేటి నుండి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

0
22
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – యాదగిరిగుట్ట
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుండి ప్రారంభం కాను న్నాయి. 11 రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాల నిర్వహణ కోసం బాలాలయాన్ని సంప్రదాయంగా ముస్తాబు చేశారు. ఉదయం 10 గంటలకు నిర్వహించే తొలి పూజతో ఉత్సవ పర్వాలు ఆవిష్కృతమవుతాయని ప్రధాన పూజారులు తెలిపారు.

రాత్రి సంప్రదాయ పర్వాల మధ్య అంకురార్పణ జరుగుతుంది. ఉత్సవాలకు వచ్చే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలె త్తకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు ఈవో చెప్పారు. ఉత్సవాల నేపథ్యంలో భక్తులు జరిపించే నిత్యహోమం, కల్యాణోత్సవ పర్వా లను రద్దు చేశామన్నారు.ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గుడిని ఎంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

ఈ బ్రహ్మోత్సవాలను రెండు తెలుఉగు రాష్ట్రాల నుండే కాకుండా పలు రాష్ట్రాల నుండి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి తమ మొక్కులను చెల్లించుకొంటారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయసిబ్బంది మరియు అధికారులు అన్ని మౌలిక వస తులను కల్పించారు.