ప్రజాసమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత – మదనపల్లె ఎమ్మెల్యే డా.తిప్పారెడ్డి

0
65
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లి
నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికే తొలి ప్రాధాన్యతను ఇస్తానని మదనపల్లి శాసన సభ్యులు డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి అన్నారు. గురువారం మదనపల్లి మండలం కొత్తపల్లి పంచాయతీ, పెంచుపాడు పంచాయ తీల్లో త్రాగునీటి సమస్యల కోసం వేసిన కొత్తబోరును స్టాటర్‌ ఆన్‌ చేసి ప్రారంభిండంతోపాటు సి.సి.రోడ్డు నిర్మాణానికి శిలాఫకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల కారణంగా సశ్యశ్యామలంగా ఉండే మదనపల్లి నియోజకవర్గంలో సైతం కరువుఛాయలు ఏర్పడ్డాయన్నారు. దీంతో గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడిందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని డప్పు కొట్టుకొనే టిడిపి నాయకులు గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించడం పూర్తిగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు.

కరువు తాండవిస్తుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో వలసబాట పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడితే, ప్రభుత్వం కరువు నివారణ చర్యలు తీసుకోకపోవడం శోచనీ యమన్నారు.వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే గ్రామీణుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతామ న్నారు.

వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు సాగునీటిని పొదుపుగా వాడాలన్నారు. రాబోవు ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఆదరించాలన్నారు. రాజన్న రాజ్యం సాకారం కావాలంటే జగనన్నను ముఖ్యమంత్రి కావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సుజనా బాలకృష్ణారెడ్డి, కొటూరి ఈశ్వర్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు.