అనేక అనారోగ్య సమస్యలను నివారించే పుచ్చకాయ విత్త‌నాలు

0
60
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హెల్త్‌ డెస్క్‌
ఈ ఏడాది వేసవి ఆరంభలోనే ఎండలు మండిపోతున్నాయి.ప్రతి ఏడాది కంటే ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉంటాయంటు న్నారు నిపుణులు.దీంతో అంద‌రూ శ‌రీరానికి చ‌ల్ల‌దనాన్నిచ్చే ఆహార ప‌దార్థాల కోసం చూస్తున్నారు. అలాంటి వాటిలో పుచ్చ‌కాయ‌లు చాలా ముఖ్య‌మైన‌వి. ఈ సీజ‌న్‌లో ఎక్కువ‌గా ల‌భించే పుచ్చ‌కాయ‌ల‌ను నిత్యం తింటే శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం ల‌భిస్తుంది. ప‌లు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. అయితే కేవ‌లం పుచ్చ‌కాయ‌లే కాదు, వాటి విత్త‌నాల‌ను కూడా మ‌నం తిన‌వ‌చ్చు.

పుచ్చకాయ విత్త‌నాల‌ను తరచూ తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు

– డ‌యాబెటిస్ ఉన్న‌వారు పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను నిత్యం తింటుంటే షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. ర‌క్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి.
– హైబీపీ ఉన్న‌వారు పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను తింటే బీపీ త‌గ్గుతుంది. బీపీ త్వ‌ర‌గా అదుపులోకి వ‌స్తుంది.
– పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల కండ‌రాలు దృఢంగా మారుతాయి. అల‌స‌ట త‌గ్గుతుంది.
– మెద‌డు ప‌నితీరు మెరుగ్గా ఉండాలంటే పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను రోజూ తినాలి.
– కంటి చూపును మెరుగుప‌రిచే అద్భుత‌మైన ఔషధ గుణాలు పుచ్చ‌కాయ విత్త‌నాల్లో ఉంటాయి. వీటిని నిత్యం తింటుంటే నేత్ర స‌మ‌స్య‌లు పోతాయి.