నల్గొండ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం – ఏడుగురు మృతి

0
18
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నల్గొండ
తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని కొండమల్లేపల్లి వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.ఆర్టీసీ బస్సు – టాటా ఏస్ వాహనం ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు దేవరకొండ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల నివాసాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

హైదరాబాద్ నుంచి మల్లెపల్లి వైపు వస్తున్న టాటా ఏస్ వాహనం.. హైదరాబాద్ వైపు వెళ్తున్న దేవరకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. టాటా ఏస్ వాహనం టైర్ పగిలిపోవడంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.