జపాన్‌లో ఇంజనీరింగ్‌ విద్యార్థులకు అవకాశాలపై మిట్స్‌లో అవగాహన సదస్సు

0
249

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లి
చిత్తూరుజిల్లా మదనపల్లి సమీపంలోని మదనపల్లి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ & సైన్స్‌ (మిట్స్‌ కళాశాల) నందు “కెరీర్స్ అండ్ ఆపేర్చునిటీస్ ఫర్ ఇంజనీర్స్ ఇన్ జపాన్” అను అంశంపై అవగహన కార్యక్రమాన్ని బి.టెక్ విద్యార్థులకు నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా కోబాయాషి, సి.ఈ.ఓ మరియు కెంటారో కురోయివా, మేనేజర్, హ్యూమన్ రిసోర్సు డెవలప్మెంట్  విభాగం, కోనోమిటీ కో., లిమిటెడ్., కంపెనీ, టోక్యో, జపాన్ లు పాల్గొన్నారు.

కళాశాలలోని విద్యార్థులు జపనీస్ భాషలో వారితో మాట్లాడటం చూసి, అతిధులు ఇద్దరు ఆనందం వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తమ కళాశాలలోని విద్యార్థులు జపాన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారని ఆయన అన్నారు. ఇద్దరు విద్యార్థులు జపాన్ లోని ప్రభుత్వ యూనివర్సిటీ అయిన ఇవాతే ప్రిఫెక్చరల్ యూనివర్సిటీ నందు ఇంటర్న్షిప్ కూడా పూర్తి చేశారని ఆయన అన్నారు. కార్యక్రమంలో ముందుగా కోబాయాషి మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)పై జపాన్ లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువని, విద్యార్థులు జపాన్ బాషాపై పట్టు సాధించాలన్నారు.

ఇంజనీరింగ్ రంగంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ పోలిస్తే కంప్యూటర్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పై ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, ప్రస్తుతం ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ పై మరింత ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు. విద్యార్థులకు టెక్నికల్ స్కిల్స్ చాలా ముఖ్యమని, దీనితో పాటు జపాన్ బాషాను నేర్చుకోవాలన్నారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం పైనే కాకుండా వారి విద్యార్ధి దశలో జపాన్ బాషాపై పట్టు సాధించాలన్నారు.

జపాన్ దేశంలో విద్యార్థులకు ఇంటర్న్షిప్ లు మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయన్నారు. ముఖ్యం గా భారతీయ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా అందించాడని అక్కడి కంపెనీల వారు ఆసక్తి కనబరుస్తున్నార న్నారు. విద్యార్థులకు గల సందేహాలను వారితో అడిగి తెలుసుకున్నారు. కెంటారో కురోయివా మాట్లాడుతూ జపాన్ బాషాలో మొత్తం 5 విభాగాలుగా జపాన్ బాషా ఉంటున్నదని వాటిని ఎన్5, ఎన్4, ఎన్3, ఎన్2, ఎన్1 లుగా ఉంటాయన్నారు.

ఇందులో ఇండియన్ విద్యార్థులు ఎన్5, ఎన్4, ఎన్3 విభాగాలు నేర్చుకొని జపాన్ ప్రభుత్వం వారు నిర్వహించే పరీక్షలో ఉతీర్ణులు అయితే నెలకు జపాన్ నందు ఒక లక్ష 50 వేల రూపాయలకు మించి జీతం ఉన్న ఉద్యోగ అవకాశాలు ఉన్నాయ న్నారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంపైనే కాకుండా వారి విద్యార్ధి దశలో జపాన్ బాషా పై పట్టు సాధించాలని అన్నారు.

ఈ కార్యాక్రమంలో డాక్టర్ జి.ఎస్. సగ్గు, సి.ఈ.ఓ  మరియు మిస్టర్ మనీష్ గుప్తా, పార్టనర్, ఓరియన్ ప్రొడక్షన్ & కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఎదోగో-కుయు, టీకో, జపాన్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.సి.యువరాజ్,ఇంగ్లీష్ అండ్ ఫారిన్ విభాగాధిపతి డాక్టర్ రోసలియా, డీన్ అడ్మిన్ & ఇంటర్నేషనల్ రిలేషన్స్ డాక్టర్ శ్రీమంత బసు, కోఆర్డినేటర్ ఇంటెర్నేషన్ రిలేషన్స్ యు. విజయ లక్ష్మి, మరియు విద్యార్థులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.