హైదరాబాద్ లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా కు అడ్మిషన్ అండ్ ప్లేస్ మెంట్ అధికారిగా ఎంపికైన ఎం.హెచ్. దాదాపీర్

0
247
advertisment

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
కేంద్ర ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్ లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాప్ కాలేేజీ ఆఫ్ ఇండియా, హస్పిటిల్ మేనేజ్ మెంట్ విభాగానికి అడ్మిషన్స్ అండ్ ప్లేస్ మెంట్స్ అధికారిగా ఎం.హెచ్. దాదాపీర్ ను నియమించినట్లు అడ్మినిస్ట్రేటివ్ స్టాప్ కాలేేజీ ఆఫ్ ఇండియా రిజిష్టర్ అండ్ సెక్రటరి కళ్యాణ్ రాయ్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఈయన గతంలో ఐసిఐసిఐ, హెచ్.డి.ఎఫ్.సి లైఫ్ ఇన్సూరెన్స్ విభాగంలో మేనేజరుగాను, చిత్తూరు జిల్లా మదనపల్లిలోని మిట్స్ ఇంజనేరింగ్ కాలేజీలో అడ్మినిస్ట్టేటివ్ ఆఫీసర్(అడ్మిషన్స్)గాను, విశ్వం విద్యాసంస్థలలో ఇంజనేరింగ్ కాలేజీకి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పనిచేశారు.

తాను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా కు అడ్మిషన్స్ అండ్ ప్లేస్ మెంట్స్ అధికారి గా నియతులు కావడం పట్ల దాదాపీర్ సంతోషం వ్యక్తం చేశారు. తన కెరీర్ అభివృద్ధికి సహకరించిన వారందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.