పాక్‌కు వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు

0
23
advertisment

మనఛానల్‌ న్యూస్‌- ఎన్ఆర్ఐ డెస్క్‌
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ వారికి బాసటగా నిలుస్తున్న పాక్‌ తీరుపై అమెరికాలో నిరసనలు వ్యక్తమయ్యాయి.ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన ప్రజలు న్యూయార్క్‌లోని యునైటెడ్‌ నేషన్స్ భవనం ముంగిట ఆదివారం నిరసనలు తెలియజేశారు.

ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల కాన్వాయ్‌పై జరిగిన ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించారు. దీనికి పాకిస్థాన్‌ జవాబు చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు. బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఇజ్రాయెల్‌, కరేబియన్‌, బలోచిస్థాన్‌(పాకిస్థాన్‌లో కొంత భాగం) ప్రాంతాలకు చెందిన దాదాపు 400 మంది ఈ నిరసనలో పాల్గొన్నారు.

ప్రపంచ దేశాలకు పాకిస్థాన్‌ క్యాన్సర్‌లా మారింది. ఉగ్రవాదాన్ని పోషిస్తూ ఇండియాపైనా, ప్రపంచ దేశాలపైనా దాడులకు పురిగొల్పుతోంది. ఇప్పటి వరకూ వాళ్ల ఆటలు సాగాయి. ఇకపై సాగవు. ఇండియా వారి దాడులను బలంగా తిప్పికొట్టింది. మనమంతా ఇండియాకు మద్దతుగా నిలవాలి. పాకిస్థాన్‌ తాను చేస్తున్న తప్పును తెలుసుకునేలా చేయాలని వారన్నారు.