కర్ణాటక బ్యాంక్‌కు రూ.4 కోట్ల జరిమానా విధించిన ఆర్‌బీఐ

0
19
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – ఎకానమీ డెస్క్‌
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ప్రైవేటు రంగ బ్యాంకైన కర్ణాటక బ్యాంక్‌కు భారీ జరిమానాను విధించింది.నిబంధనలను ఉల్లంఘించినందుకు బ్యాంకుపై ఆర్‌బీఐ 4 కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ప్ర‌పంచవ్యాప్తంగా బ్యాంకింగ్‌ సేవలకు వినియోగించే సాఫ్ట్‌వేర్‌ స్విఫ్ట్ (సొసైటీ ఫర్‌ వరల్డ్‌వైడ్‌ ఇంటర్ ‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ టెలీ కమ్యూనికేషన్‌) సంబంధిత కార్యాచరణ నియంత్రణ లోపం కారణంగా ముఖ్యంగా, నాలుగు నిబంధనల అమలులో ఆలస్యం జరిగిందని ఆర్‌బీఐ పేర్కొంది.

దీంతోపాటు మరో నాలుగు బ్యాంకులు( ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేనా బ్యాంక్, ఐడిబిఐ)కు నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో నగదు జరిమానా విధించింది. యూనియన్ బ్యాంక్, దేనా బ్యాంకుకు రూ. 2కోట్లు, ఐడీబీఐ, ఎస్‌బీఐ లకు తలా ఒక కోటి రూపాయలు చొప్పున జరిమానా విధించింది.

శనివారం రెగ్యులేటరీకి అందించిన సమాచారంలో ఆయా బ్యాంకులు వెల్లడించాయి. కాగా స్విఫ్ట్‌ లావాదేవీల అక్రమాల కారణం గానే ప్రభుత్వ రంగ బ్యాంకులో రూ.14వేల కోట్ల స్కాం సంభవించిన సంగతి తెలిసిందే.