అలబామా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన టోర్నడో

0
18
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – ఎన్‌ఆర్‌ఐ డెస్క్‌
అమెరికాలోని ప్రముఖ రాష్ట్రమైన అలబామా టోర్నడో తుఫాన్‌ ధాటికి అతలా కులతమైంది.ఈ ఫెను తుపాను తీవ్రతకు అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. వందల సంఖ్యలో చెట్లు నేలకూలాయి. టోర్నడో ధాటికి ఇప్పటివరకు 22 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు.ఆగ్నేయ అలబామాలో టోర్నడో ప్రభావం ఎక్కువగా ఉంది. ఇళ్లు కూలిపోవడంతో పలువురు గల్లంత య్యారు.

అత్యవసర సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు యత్నిస్తున్నారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు అధి కారులు భావిస్తున్నారు.

పలువురు గాయపడగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చెట్లు కూలి రోడ్లపై పడటంతో రాకపోక లకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా కూడా నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. జార్జియా, ఫ్లోరిడా, దక్షిణ కరోలినా ప్రాంతాల్లోనూ టోర్నడో హెచ్చరికలు జారీ చేశారు.