వైకాపా లోకి టిడిపి నేత రఘరామ కృష్ణంరాజు

0
289

మనఛానల్ న్యూస్ – హైదరబాద్
ప్రముఖ వ్యాపార వేత్త పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్‌ నేత రఘురామ కృష్ణంరాజు ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లోని వైఎస్‌ జగన్‌ నివాసంలో ఆదివారం ఉదయం కలిశారు.

హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లోని వైఎస్‌ జగన్‌ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్‌ సీపీలోకి వలసలు పెరుగుతున్న సంగతి తెలిసింది.

ఈ నేపథ్యంలో కృష్ణంరాజు కలయిక ప్రాధాన్యత సంతరించుకొంది. తెలుగుదేశం లో టికెట్లు పంపకం పూర్తి అయ్యే లోపు మరిన్నీ వలసలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీకి చెందిన ఇద్దరు ఎంపీలుతో పాటు పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీలో చేరిన విషయం విదితమే. ఈయన లోకసభ సీటు కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.