కదిరి వైకాపా టికెట్ కల్పలతరెడ్డి కా? లేక డాక్టర్ సిద్ధారెడ్డికా…?

0
443
advertisment

మనఛానల్ న్యూస్ – కదిరి 

ఏపిలో అసెంబ్లీ, లోకసభలకు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులు టికెట్ల కోసం ప్రయత్నాలు మమ్మురం చేశారు. ఈ పరంపరలో రాజకీయ పార్టీలు ఏనియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇస్తాయో  తెలియని పరిస్థితి ఏర్పడింది. ముందుగా ప్రకటించిన అభ్యర్థులు కూడ నామనేషన్లు దాఖలు చేసి బి-ఫారాలు అందించే వరకు డౌటుగానే కనిపిస్తోంది.

అనంతపురం జిల్లా కదిరి అసెంబ్లీ స్థానానికి స్థానికంగా ఉన్న ప్రముఖ వైద్యుడు డాక్టర్ సిద్దారెడ్డి పేరును వై.ఎస్.ఆర్.సి.పి   జిల్లా ఇన్-చార్జీ , మాజీ ఎం.పి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈతరుణంలో  నియోజకవర్గానికి చెందిన ప్రముఖ వైకాపా నేతలు వజ్రభాస్కర్ రెడ్డి, తలుపుల మాజీ ఎం.పి.పి ఆవుల మనోహర్ రెడ్డి, మాజీసర్పంచ్ బండపల్లి సూర్యనారాయణరెడ్డి, నంబుల పూలకుంట జగదీష్ రెడ్డి తదితరులు సిద్దారెడ్డి అభ్యర్థత్వంపై అసంతృప్తితో ఉన్నారు.
దీంతో బలమైన సామాజిక వర్గం, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన మహిళ నేత బండపల్లి కల్పలతా రెడ్డి కదిరి అసెంబ్లీ వైకాపా అభ్యర్థిగా బరిలో ఉండే అవకాశం ఉన్నట్లు ప్రముఖంగా ప్రజలలో వినిపిస్తోంది.బండపల్లి కుటుంబం నియోజకవర్గంలో రాజకీయంగా బలంగా ఉండడమేగాక, నియోజకవర్గంలోని అన్ని మండలాలలో బంధువర్గం అధికంగా ఉంది.
డాక్టర్ సిద్ధారెడ్డి స్థానికుడు కాకపోవడం, ప్రజా సంబంధాలు తక్కువగా ఉండడం, ప్రజలతో కలుపుగోలుతనం లేకపోవడం ఆయనకు పెద్ద మైనస్ గా కనిపిస్తోంది. దానికి తోడు గతంలో వై.ఎస్.ఆర్ బ్రతికి ఉన్నప్పుడు ప్రజారాజ్యం పార్టీ తరపున పోటి చేసి ఓడిపోవడమే కాక, కేవలం 15 వేలు ఓట్లు మాత్రమే సాదించారు.
కల్పలతా రెడ్డి మామయ్య బండపల్లి సూర్యనారాయణరెడ్డి మూడు సార్లు తలుపుల మేజరు గ్రామపంచాయతీ  సర్పంచ్ గా పనిచేశారు.వీరికి వై.ఎస్.ఆర్ కుటుంబంతో మంచి సాన్నిహిత్యం ఉంది. దీనికి తోడు బండపల్లి మరియు ఆవుల కుటుంబాల మధ్య బంధుత్వాలు కూడ కలిసి వస్తుందని భావిస్తున్నారు.అలాగే బండపల్లి మదన్ మెహన్ రెడ్డి ఆవుల కుటుంబంలో వివాహం చేసుకోవడంతో  వీరికి బాగా కలిసి వస్తుందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.
కదిరికి చెందిన మైనార్టీ సీనియర్ నాయకుడు హిందుపురం మాజీ ఎం.పి కల్నల్ నిజాముద్దీన్ బండపల్లి కుటుంబానికి టికెట్ ఇస్తే తమ మైనార్టీ ఓట్లతో పాటు నియోజకవర్గంలోని పలు మండలాలలకు చెందిన టిడిపి నాయకుల నుంచి సైతం మద్దతు ఇచ్చేలా చూస్తున్నానని హామి ఇచ్చినట్టు తెలిసింది. ఇంకో వైపు మాజీ ఎం.ఎల్.ఎ మోహన్ రెడ్డి సైతం కల్పలతారెడ్డికి టికెట్ ఇస్తే మద్దతు ఇస్తానని అంటున్నారు.
మాజీ రెస్కో ఛైర్మన్ ఆవుల పద్మావతమ్మ, తలుపుల మాజీ ఎం.పి.పి ఆవుల మనోహర్ రెడ్డి, మాజీ సింగల్ విండో అధ్యక్షుడు ఆవుల ఓబుల్ రెడ్డిలు కల్పలతారెడ్డికి మద్దుతు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు.అలాగే కదిరి వైకాపా టికెట్ ఆశిస్తున్న బండపల్లి కల్పలతా రెడ్డి తండ్రి తెలుగుదేశం పార్టీలో బలమైన నేతగా ఉంటున్నారు.ఈయన అనంతపురం జిల్లా పరిషత్ వైఎస్ ఛైర్మన్ గా మరియు తలుపుల ఎం.పి.పిగా కూడ పనిచేశారు. కుమార్తె కు టికెట్ ఇస్తే ఆయన వైకాపాలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.
మరో వైపు కల్పలతా రెడ్డి భర్త బండపల్లి ప్రతాప్ రెడ్డి ప్రభుత్వ అధికారి కావడంతో మంచి గుర్తింపు ఉంది.ఈయన రాయలసీమలో పలు జల్లాల్లో జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేశారు.ప్రస్తుతం కడప రీజనల్ జాయింట్ డైరక్టర్ గా పనిచేస్తున్నారు. మూడు జిల్లాల్లో ఉపాధ్యాయులతో మంచి సంబంధాలు ఉండడంతో పార్టీకి కూడ ఎంతో ఉపయోగo అవుతుదని వైకాపా నేతలు అంటున్నారు.
కదిరి నియోజకవర్గంలో విరివిగా బంధుత్వాలు, సామాజికవర్గం బలం,పార్టీకి మైనార్టీలు, ఇతర వర్గాల ఓట్లు ఉండడం వల్ల తమకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తామని కల్పలతా రెడ్డి ధీమాతో ఉన్నారు. కల్పలతారెడ్డి కుటుంబం టికెట్ కోసం జగన్, విజయసాయిరెడ్డి, ఎం.పి మిధున్ రెడ్డిలను కలసి తమ ప్రయత్నాలు ప్రారంభించారు.
ప్రస్తుతం పార్టీ అధిష్టానం మాత్రం డాక్టర్ సిద్దారెడ్డి విషయంలో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. ఇంకో వైపు సిద్దారెడ్డి కాకుండ మరో వ్యక్తికి టికెట్ ఇవ్వాలని ప్రయత్నిస్తే తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కల్పలతా రెడ్డి కోరుతున్నట్లు తెలిసింది.