వడ్డీరేట్లను తగ్గించిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు

0
15
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – ఎకానమీ డెస్క్‌
తమ ఖాతాదారులకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) శుభవార్త తెలిపింది. వివిధ కాలపరితులకు లోబడి ఇచ్చే రుణాలపై విధించే ఎంఎల్‌సీఆర్‌(మారిజినల్ కాస్ట్ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్‌డ్‌ లేండింగ్‌ రేట్‌)ను 0.10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది.

సంవత్సర కాలగడువుపై ఇచ్చే రుణాలపై ప్రస్తుతమున్న 8.55 శాతం రేటును 8.45కి తగ్గించింది. అంతేకాకుండా ఓవర్‌నైట్‌ /నెల, మూడు నెలలు, ఆరు నెలల గడువుపై ఇచ్చేరుణాలపై 10 బేసిస్‌‌ పాయింట్లు తగ్గించి వరసగా 8.05శాతం, 8.10 శాతం, 8.15శాతంగా వడ్డీరేట్లను బ్యాంకు నిర్ణయించింది.

అయితే బ్యాంకు బేస్‌ రేటులో మాత్రం ఎలాంటి మార్పులు చేయకుండా 9.25శాతంగానే ఉంచింది. కొత్త వడ్డీరేట్లు మార్చి1 నుంచి అమలవుతాయని బ్యాంకు తెలిపింది. అంతకుముందు ఫిబ్రవరి 8న ఎస్‌బీఐ(స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) రూ.30 లక్షలలోపు ఇచ్చే రుణాలపై వడ్డీరేటు 0.05పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే.