వరుసగా రెండో రోజు నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

0
12
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – బిజినెస్‌ డెస్క్‌
దేశ సరిహద్దులలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ దేశీయ స్టాక్‌ మార్కెట్లు రెండో రోజు నష్టాలతో ముగిశాయి.రోజంతా నష్టాల మధ్య ఊగిసలాడిన స్టాక్‌మార్కెట్లు చివరికి నెగిటివ్‌గా ముగిశాయి.

సెన్సెక్స్‌ 68 పాయింట్లు నష్టపోయి 35,905 వద్ద, నిఫ్టీ 29 పాయింట్లు క్షీణించి 10806వద్ద ముగిశాయి. దీంతో వరుసగా రెండో రోజు కూడా నష్టాల్లో ముగిసినట్టయింది. దాదాపు అన్ని రంగాలున ష్టాల్లోనే ముగిశాయి.

అల్ట్రాటెక్‌ సిమెంట్‌, బజాజ్‌ ఆటో, యూపీఎల్‌, సన్‌ ఫార్మ, భారతి ఎయిర్‌టెల్‌ టాప్‌ విన్నర్స్‌గా ఉన్నాయి. భారతి ఇన్‌ఫ్రా టెల్‌ విప్రో, వేదాంతా, టాటా మోటార్స్‌, టైటన్‌ భారీగా నష‍్టపోయాయి.