
మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
పాక్ భూభాగంలోని జైషే ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన దాడులు జరిపిన కొన్ని గంటల్లోనే పాక్‌కు చెందిన ఓ డ్రోన్ భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చినట్లు సమాచారం. వెంటనే గుర్తించిన భారత బలగాలు మంగళవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో దాన్ని పేల్చివేశారు.
గుజరాత్‌లోని కచ్ అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న నలియా ఎయిర్ బేస్ సమీపంలో గుర్తించిన దీన్ని అక్కడి సిబ్బంది వెంటనే పేల్చివేశారు. ఈ ఎయిర్ బేస్ సరిహద్దు అతి సమీపంలో ఉంటుంది.
ఇప్పటికే దాడుల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలైన జమ్ముకశ్మీర్, పంజాబ్‌లలో హైఅలర్ట్ ప్రకటించగా గుజరాత్‌లోనూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాయుసేన హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించినా వెంటనే సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.