భారతీయ డాక్యుమెంటరీ చిత్రానికి ఆస్కార్ అవార్డు

0
60
advertisment

మనఛానల్ న్యూస్ – సినిమా డెస్క్
సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న రుతుక్రమణ సమస్యపై భారతదేశానికి చెందిన ప్రముఖ నిర్మాత గునీత్‌ మోంగా నిర్మించిన ‘పీరియడ్‌: ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్’ అనే డాక్యుమెంటరీ చిత్రానికి 91వఆస్కార్‌ అవార్డు లభించింది. అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 91వ ఆస్కార్‌ వేడుకలో ఈ భారతీయ డాక్యుమెంటరీ చిత్రానికి అవార్డు లభించదని నిర్వహకులు ప్రకటించారు.

ఈ సందేశాత్మక చిత్రంలో ముఖ్యంగా భారతీయ సమాజంలో వివిధ ప్రాంతాల్లో ఆడపిల్లలు ప్రకృతి ధర్మంలో భాగంగా ఏర్పడే రుతుక్రమ సమస్యల గురించి ఈ డాక్యుమెంటరీలో కళ్లకు కట్టేలా దర్శకుడు చూపించారు. ఈ చిత్రానికి రేకా జెహ్‌తాబ్చి దర్శకత్వం వహించారు. భారతీయ సినిమాలకు ఆస్కార్ రావడం చాలా అరుదు. పలు మార్లు వివిధ భారతీయ  సినిమాలు ఆస్కార్ కు నామనేట్ అయినా చివరిలో తిరస్కారానికి గురి అయ్యేవి. అలాంటిది ఈసారి ఓ డ్యాకుమెంటరీకి ఈ అవార్డు దక్కడం విశేషం.