ఘనంగా ‘కువైట్ తెలుగుదేశం శంఖారావం’

0
204
advertisment

మనఛానల్ న్యూస్ – గల్ఫ్ ప్రతినిధి
కువైట్ లో ఖైతాన్ ప్రాంతం లోని కార్మెల్ స్కూల్ లో వేదికగా ఎన్.ఆర్.ఐ టిడిపి కువైట్ -2019 కోర్ కమిటి  సభ్యులు కుదరవళ్లి సుధాకర్ రావు, బలరాం నాయుడు, నాగేంద్ర బాబు అక్కిలి, మహామ్మద్ బోరా వారి ఆధ్వర్యంలో    నిర్వహించిన ‘కువైట్ శంఖారావం’ కార్యక్రమం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది.

స్వదేశంలో తెలుగు రాష్ట్రాలలో జరిగే సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ధీటుగా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, ఎన్‌ఎండీ ఫారూఖ్‌, సీ ఆదినారాయణ రెడ్డి, నాయకులు గొల్లపల్లి సూర్యారావు, జూపుడి ప్రభాకర్‌ రావు, ఏపీ ఎన్నార్టీ చైర్మన్‌ వేమూరి రవి తదితరులు మాట్లాడారు.

రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పటికీ అన్ని వర్గాల వారితో పాటుగా ప్రవాసీయుల సంక్షేమానికీ తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమలను అతిధులు ఎన్.ఆర్.ఐ లకు వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధికి అడుగడుగున కేంద్రం, వైసీపీ అడ్డంకులు, అవరోధాల సృష్టిస్తున్నాయని, నూతన రాష్ట్రం సవాలక్ష సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ సీఎం చంద్రబాబు ఆత్మస్థైర్యంతో, చిత్త శుద్ధితో రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతున్నారని తెలుగుదేశం నాయకులు పార్టీ అధినేత చంద్రబాబును కొనియాడారు.

advertisment

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అతిధులుగా పాల్గోనడానికి 14 మంది తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు ప్రత్యేకంగా ఏపి నుంచి కువైట్ కు వచ్చారు. శుక్రవారం కువైట్ లో సెలవు కావడంతో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

కడప జిల్లా కడప, జమ్ములమడుగు, రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరులతో పాటు తూర్పు గోదావరి జిల్లా రాజోలు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గాలకు చెందిన పార్టీ అభిమానులు ప్రత్యేకించి సామాజిక వర్గాల వారీగా విడిగా సమావేశాలు నిర్వహించుకున్నారు. సమాచార మంత్రి మొహమ్మద్‌ నాసిర్‌ అల్‌ జాబ్రీను రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఫారూఖ్‌ మర్యదపూర్వకంగా కలుసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించవల్సిందిగా ఆహ్వానించారు. గురువారం మంత్రులు ఫరూఖ్‌, రవీంద్ర, ఇతర నాయకులు భారతీయ ఎంబసీకు వెళ్ళి కువైట్ లోని భారతీయ రాయబారి కె.జీవసాగర్‌ను కలిశారు.కువైట్ ఎన్.ఆర్.ఐ టిడిపినేతలు గుదే నాగార్జున చౌదరీ, సురేష్ నాయుడు,వెంకట్ కోడూరి, మల్లి మారోతి, రేగి వెంకటేష్ నాయుడు, రహంతుల్లా తదితరులు కార్యక్రమం విజయవంతం చేయడానికి విశేషంగా కృషి చేశారు.