
మనఛానల్ న్యూస్ – స్పోర్ట్స్ డెస్క్
న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీ 6 వికెట్లతో చెలరేగడంతో మూడో వన్డేలో బంగ్లాదేశ్‌ను 88 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిం చింది.దీంతో మూడు వన్డేల సిరీస్‌ను కివీస్ 3-0తో కైవసం చేసుకుంది.డ్యునెడిన్‌లో జరిగిన చివరి వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ రాస్ టేలర్ (69), హెన్రీ నికోలస్ (64), లాథమ్ (59), గ్రాండ్ హోమ్ (37), నీషమ్ (37 పరుగులు) సమయోచితంగా రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది.
బంగ్లా బౌలర్లలో ముస్తిఫిజుర్ 2 వికెట్ల పడగొట్టారు. అనంతరం 337 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ న్యూజి లాండ్ బౌలర్ల ధాటికి నిలువలేకపోయారు.టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్‌లు నిప్పులు చెరగడంతో కేవలం 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
అయితే సైఫుద్దీన్ (44), షబ్బీర్ రహ్మాన్ (102)లు ఐదో వికెట్‌కు 101 పరుగులు జోడించారు.మెహదీ హసన్ (37) రాణించినప్పటికీ బంగ్లాదేశ్ విజయానికి చాలా దూరంగా నిలిచిపోయింది. టిమ్ సౌథీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మార్టిన్ గప్టిల్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి.