మీ-కోసం ఫిర్యాదుల పరిష్కారానికి కృషి – మదనపల్లి సబ్‌కలెక్టర్‌ కీర్తి చేకూరి

0
142
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లి
మీకోసం కార్యక్రమానికి వచ్చే అర్జీలకు సంబందించి సమస్యల పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం 10.30 గంటల నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ప్రజావాణి (మీకోసం) కార్యక్రమం మద్యాహ్నం 2. గం. వరకు నిర్వహించారు. మీ కోసం కార్యక్రమానికి వివిధ మండలాల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజలు అర్జీలను నేరుగా సబ్ కలెక్టరుకు అందజేశారు.

ప్రజల నుంచి 131 ఆర్జీలను స్వీకరించి క్షున్నంగా పరిశీలించి అర్జీదారుల నుండి సమస్యలు తెలుసుకొని మీ సమస్యలను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అర్జీధారులకు సబ్ కలెక్టర్ సూచించారు. అర్జీదారుల సమస్యలను పరిశీలించి సమస్యను పరిష్కారం అవుతుందా, కాదా అని నిర్ణయించి అర్జీదారులకు సమాధానం తెలపాలే తప్ప, అర్జీదారులను ప్రతి వారంవారం ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా వెంటనే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పలు మండలాలకు చెందిన అర్జీదారులు రేషన్ కార్డ్స్, పించన్లు, ఒంటరి మహిళలకు పెన్షన్లు, ఇంటి పట్టాలు, భూ సర్వే, భూ సమస్యలు, గృహాల మంజూరు, గృహాలకు బిల్లులు, హంద్రి-నీవా సుజల స్రవంతికి(హెచ్.ఎన్.ఎస్), నేషనల్ హైవే(ఎన్.హెచ్)కి, భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం, పట్టాదారు పాసు పుస్తకాలు, ఈ పాస్ పుస్తకాలు, భూములు ఆన్ లైన్ చేయించాలని, గృహాలకు స్థలం మంజూరు చేయాలని, త్రాగు నీటి సమస్యలు, దారి, కోర్టులో ఉన్న కేసులు,చంద్రన్న భీమా,స్వయం సహాయక సంఘాలలో గ్రూప్ లీడర్లు సరిగా డబ్బులు అందజేయలేదని వంటి సమస్యల అర్జీలను నేరుగా, సబ్ కలెక్టర్ గారికి అర్జీదారులు అందజేశారు.

వీటిని పరిశీలించి సంబందిత శాఖ అధికారులకు అందజేశారు. ప్రజావాణి కార్యక్రమానికి హాజరైతే అర్జీదారుల సమస్యలను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, మీ పరిధిలో లేని అర్జీదారుల సమస్యలను జిల్లా స్థాయి అధికారులకు పంపించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, సమస్యలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న సమాచారమును శనివారం సాయంత్రానికి సబ్ కలెక్టర్ కార్యాలయంకు అందజేయాలని,సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.

advertisment

– మదనపల్లి డివిజన్ మూగ, చెవిటి విభిన్న ప్రతిభావంతుల సంస్థకు చెందినా సుమారు వంద మంది తమ సమస్యలను పరిష్కరించాలని సబ్ కలెక్టరుకు అర్జీని అందజేశారు. మదనపల్లె పట్టణ పరిధిలోని సుమారు నాల్గు వందల మంది చెవిటి, మూగ,వికలాంగులు ఉన్నామని మాకు ప్రభుత్వం లేదా ప్రైవేటు సంస్థలలో మా అర్హతను బట్టి మాకు ఉద్యోగాలు కల్పించాలని కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి టైలరింగ్, కంప్యుటర్, అల్లికలు,చేతి వృత్తుల విద్యా కోర్సులలో శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించాలని ప్రతి ఇంటికి అంత్యోదయ కార్డు ద్వారా నెలకు 35 కేజీల బియ్యం అందజేయాలన్నారు.

ప్రతి ఒక్కరికి గృహాలు మంజూరు చేయాలనీ, మా సంస్థ నిర్మించుకోనుట కు ఒక ఎకరా స్థలం కేటాయించాలని అర్జిని సబ్ కలెక్టర్ కు సమర్పించుకున్నారు.మీ కోసం కార్యక్రమమునకు ఎ.ఓ సురేష్ బాబు,డిప్యూటి ల్యాండ్ అండ్ సర్వేయర్ గురుస్వామి, గృహనిర్మాణ శాఖ.వెంకట్రెడ్డి, ఎ.పి డి డ్వామా చందన, మునిసిపల్ కార్యాలయం జూనియర్ సహాయకులు రత్నమ్మ, వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.