ప్రపంచకప్‌ ప్రణాళికలో ఆ ముగ్గురు ఆటగాళ్లు – ఎమ్మెస్కే ప్రసాద్‌

0
26
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
ఇంగ్లాండ్‌ వేదికగా మరో మూడు నెలల్లో జరుగనున్న ప్రపంచకప్‌కు భారత క్రికెట్‌ జట్టు తమ కసరత్తు ముమ్మరం చేసింది. ఒకవైపు యువ ఆటగాళ్లను పరీక్షిస్తూనే వారి బ్యాటింగ్‌ ఆర్డర్‌పై కూడా ఒక కన్నేసి ఉంచింది. దీనిలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించింది. ఈ సిరీస్‌లో విజయ్‌ శంకర్‌ బ్యాటింగ్‌లో భారీ షాట్లు ఆడి తాను కూడా వరల్డ్‌కప్‌ రేసులో ఉన్నాననే సంకేతాలు పంపాడు.

తాజాగా విజయ్‌ శంకర్‌ స్థానంపై టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప‍్రసాద్‌ సూత్రప్రాయంగా స్పష్టత ఇచ్చాడు. ఆ మెగా టోర్నీలో భాగంగా విజయ్‌ శంకర్‌ కూడా తన ప్రణాళికల్లో ఉన్నాడంటూ పేర్కొన్నాడు. విజయ్‌తో పాటు రిషభ్‌ పంత్‌, అజింక్యా రహానేలు కూడా వరల్డ్‌కప్‌కు వెళ్లే భారత జట్టు ప్రాబబుల్స్‌ కోసం పరిశీలనలో ఉన్నట్లు తెలిపాడు.

ఏప్రిల్‌ 23వ తేదీ జట్లు ఎంపికకు చివరి తేదీ కాగా, ఈలోపు పూర్తిస్థాయి జాబితాను సిద్ధం చేసేందుకు టీమిండియా మేనేజ్‌ మెంట్‌ తర్జన భర్జన పడుతోంది.దీనిలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఎంఎస్‌కే ప్రసాద్‌ విజయ్‌ శంకర్‌, రిషభ్‌ పంత్‌, అజిం క్యా రహానేలు వరల్డ్‌కప్‌ రేసులో ఉన్నట్లు తెలిపాడు.

ఇప‍్పటికే రిషభ్‌ పంత్‌ తానేంటో నిరూపించుకోగా, తాజాగా విజయ్‌ శంకర్‌పై మేనేజ్‌మెంట్‌ ఒక స్పష్టతకు వచ్చినట్లు పేర్కొ న్నాడు. గత రెండేళ్ల నుంచి భారత్‌-ఎ తరఫున విజయ్‌ శంకర్‌ నిలకడగా ఆడుతున్న విషయాన్ని కూడా ఎంఎస్‌కే ఈ సంద ర్భంగా తెలిపాడు. ఇక దేశవాళీ క్రికెట్‌లో విశేషంగా రాణిస్తున్న రహానే వరల్డ్‌కప్‌ ఎంపిక రేసులో ముందువరుసలో ఉన్నాడ న్నాడు.