పెండింగ్‌లో ఉన్న స్వీపర్ల జీతాలను వెంటనే చెల్లించాలి – ఏఐటియుసి నాయకుల ధర్నా

0
24
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లి
మదనపల్లి ఆర్టీసీ బస్టాండులో పనిచేస్తున్న స్వీపర్లకు పెండింగులో ఉన్న మూడు నెలల వేతనాలను తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం టూ డిపో కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, అనంతరం డిపో మేనేజర్ కు వినతిపత్రాన్ని అందచేశారు.

ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ స్వీపర్లకు మూడునెలలుగా కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించకుండా ఇబ్బంది పెడుతు న్నాడని, వేతనాలు లేక స్వీపర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే వారికి పెండింగులో వున్న వేతనాలు చెల్లించాలని కోరారు.

ఏఐటీయూసీ మదనపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు ముబారక్ మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా పని చేస్తున్న స్వీపర్లకు కనీస వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని, వారికి పి.ఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, మాస్కులు ,యూనిఫాం ఇవ్వాలని, ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు మురళి, రెడ్డప్ప నాయక్, రెహమాన్, నరసమ్మ, లక్ష్మిదేవి, వెంకటరమణ, మల్ల మ్మ, రమణమ్మ, మల్లేశ్వరి, రమణ నాయుడు, గంగులు, రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు.