ధర్మ పోరాట దీక్షకు సంఫీుభావం తెలిపిన పలు పార్టీల నాయకులు

0
54
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
ఢిల్లీలోని ఏపి భవన్‌ వేదికగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు విభజన హామీల అమలు, ప్రత్యేకహోదా ప్రకటించడంపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా చేపట్టిన ధర్మపోరాట దీక్షకు దేశంలోని పలు ముఖ్యపార్టీల నాయకులు తమ సంఫీుభావం తెలిపారు.

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా, జేడిఎస్‌ నేత శరద్‌ యాదవ్‌, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌లు చంద్రబాబుకు మద్ధతుగా నిలిచి ఎన్డీఎ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామని, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేశా రని దిల్లీ వేదికగా ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు కేంద్రంపై మరోసారి ధ్వజమెత్తారు. ఏపీకి జరిగిన అన్యాయం కోసమే తాము పోరాడుతున్నామని, కేంద్రం భిక్ష కోసం కాదని చెప్పారు. మూడు రోజుల సమయం ఇస్తున్నా. పార్లమెంట్‌ వేదికగా ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఏపీ ప్రజలు మిమ్మల్ని క్షమించరు అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఏపీ భవన్‌ వేదికగా ధర్మపోరాట దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక రాష్ట్రం పట్ల వివక్ష చూపినప్పుడు న్యాయం కోసం పోరాడాల్సిందే. పరిపాలించే వ్యక్తులు ధర్మాన్ని పాటించనప్పుడు మనం పోరాడాల్సిందే. పార్లమెంట్‌ సాక్షిగా ఏపీకిచ్చిన హామీలు పరిష్కరించలేదు. దీనిపై నిల దీయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. విభజన సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు.

advertisment

విభజనతో నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆనాడు భాజపా నేతలే చెప్పారు. వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని అడిగారు. అలాంటిది ఇంతవరకు ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఏపీకి అన్యాయం చేశారు. ఇచ్చిన నిధులు కూడా వెనక్కి తీసుకున్నారు. పోలవరం డీపీఆర్‌ను ఆమోదించలేదు. విశాఖ రైల్వేజోన్‌, కడప ఉక్కు పరిశ్రమపై అతీగతీ లేదు. రెవెన్యూ లోటు తీర్చలేదు. రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వలేదన్నారు.