ఢిల్లీలో ప్రారంభమైన టిడిపి ధర్మ పోరాట దీక్ష

0
214
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
విభజన హామీలతోపాటు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఢిల్లీలో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు, తెదేపా మంత్రులు చేపట్టిన ధర్మ పోరాట దీక్ష ప్రారంభమైంది.రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం కోసం దీక్ష చేసిన వేదిక (ఏపీ భవన్‌) నుంచే మరోసారి చంద్రబాబు దీక్ష చేపట్టారు.

ఎన్డీయే మధ్యంతర బడ్జెట్‌లోనూ ఏపీకి మొండిచెయ్యి చూపడంతో సీఎం చంద్రబాబు ఈ సారి దిల్లీ వేదికగా ధర్మపోరాట దీక్ష చేయాలని నిర్ణయించారు. దీంతో దేశరాజధానిలోని ఏపీ భవన్‌ వేదికగా ఈ రోజు దీక్షను ప్రారంభించారు. నల్లచొక్కాతో దీక్షకు హాజరయ్యారు.అంతకుముందు సీఎం చంద్రబాబు రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మ గాంధీకి నివాళులర్పించారు.

ఏపీ భవన్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. దీక్షా వేదికపై గాంధీ, అంబేడ్కర్‌, ఎన్టీఆర్‌ చిత్ర పటాలకు చంద్రబాబు నివాళులర్పించారు. రాత్రి 8 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. అనంతరం చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఈ దీక్షకు ఏపీ నుంచి వేలాది మంది ప్రజలు, ప్రజాప్రతినిధులతోపాటు పలు జాతీయ పార్టీల నేతలు హాజరుకానున్నారు.