కులం పేరెత్తితే కొడతానంటున్న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

0
29
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
ఎవరైనా కులం గురించి మాట్లాడితే వారిని కొడతానని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తీవ్రంగా హెచ్చరించారు.దేశంలో కుల వివక్ష ను రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నాగ్‌పూర్‌ ప్రాం తంలో ఎవరూ కులం గురించి మాట్లాడరని తెలిపారు.

పుణెలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఎన్ని కులాలు ఉన్నాయో కూడా తనకు తెలియదన్నారు. కుల, వర్గ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రజల మధ్య వ్యత్యాసాలను రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

పేదలకు సాయం చేయాలని అది దేవుడికి సేవ చేయడంతో సమానమని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ నెరవేర్చలేని హామీలు ఇవ్వడం తగదని, అలాంటి వారిని ప్రజలు తిరస్కరిస్తారని చేసి న వ్యాఖ్యలు సంచలనం అయిన విషయం తెలిసిందే. సొంత పార్టీ నేతలను ఉద్దేశించే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి.