ఏపిలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన మంత్రి గంటా

0
16

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
ఆంధ్రప్రదేశ్‌లో పదవతరగతి పరీక్షల షెడ్యూల్‌ను మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం విడుదల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. పదో తరగతి పరీక్షలకు 6.10 లక్షల మంది విద్యార్థుల దరఖాస్తు చేసుకున్నారని వీరికోసం 2,833 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తామని గంటా చెప్పారు.

పరీక్షలు పూర్తయిన నెలరోజుల్లోపే ఫలితాలను విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌లో డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి గంటా తెలిపారు.

పదవ తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఇదే..

18/03/2019 – ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-1
19/03/2019 – ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-2
20/03/2019 – సెకండ్ లాంగ్వేజ్ (హిందీ)
22/03/2019 – ఇంగ్లీష్ పేపర్-1
23/03/2019 – ఇంగ్లీష్ పేపర్-2
25/03/2019 – గణితం పేపర్-1
26/03/2019 – గణితం పేపర్-2
27/03/2019 – జనరల్ సైన్స్ పేపర్-1
28/03/2019 – జనరల్ సైన్స్ పేపర్-2
29/03/2019 – సోషల్ స్టడీస్ పేపర్-1
30/03/2019 – సోషల్ స్టడీస్ పేపర్-2