బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టిస్తున్న ‘యూరీ – ది సర్జికల్‌ స్ట్రైక్‌’

0
21
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – సినిమా డెస్క్‌
సర్జికల్‌ స్ట్రైక్స్‌తో భారతదేశ సైనికవ్యవస్థ సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసింది. సర్జికల్‌ స్ట్రైక్స్‌తో పాకిస్తాన్‌ తగిన బుద్దిచెప్పింది భారత్‌. ఇండియన్‌ ఆర్మీ విజయవంతంగా చేపట్టిన ఈ చర్య ఆధారంగా బాలీవుడ్‌లో ‘‘యూరీ – ది సర్జికల్‌ స్ట్రైక్‌’’ పేరుతో ఓ చిత్రం రూపొందించింది.

ఈ సినిమా బాలీవుడ్‌లో సరికొత్త రికార్డును సృష్టిస్తోంది.విడుదలై నాలుగు వారాలు అవుతున్నా వసూళ్లలో మాత్రం దూసుకు పోతోంది. ఇప్పటికి ఈ చిత్రం రెండు వందల కోట్లను కొల్లగొట్టింది. ఈ చిత్రాన్ని వీక్షించిన యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంటి ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు.

దేశ భక్తిని పెంపొందించేలా తెరకెక్కిన ఈ చిత్రానికి పలు రాష్ట్రాలు జీఎస్టీ నుంచి మినహాయింపును ఇచ్చాయి. విక్కీ కౌశల్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీకి ఆదిత్య ధర్‌ దర్శకత్వం వహించారు.