ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఏపిలో మొదలైన నిరసనలు

0
40

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
భారత ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు వస్తున్న సంగతి విదితమే.దీనికి నిరసనగా ఇప్పటికే పలు పార్టీలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ‘మోదీ గో బ్యాక్‌’ అంటూ నినాదాలతో నల్ల జెండాలతో పలు చోట్ల ఆందోళనలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి.ప్రధాని పర్యటించనున్న గుంటూరు నియోజ కవర్గంలో నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి.

రాష్ట్రానికి ద్రోహం చేసిన మోదీ ఏపీలో అడుగు పెట్టవద్దని తెదేపా నేతలు స్పష్టం చేశారు. మోదీని ప్రజలు స్వాగతించరని తెలుగు యువత నేతలు ఆగ్రం వ్యక్తంచేశారు. విజయవాడ లెనిన్‌ కూడలిలో వామపక్ష నేతలు నిరసనకు దిగారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీ రాష్ట్ర పర్యటనకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు.

మోదీ పర్యటనను అడ్డుకుని తీరుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. మోదీ పర్యటనను నిరసిస్తూ కడప జిల్లాలో మట్టి, నీళ్ల కుండలతో వామపక్షాలు వినూత్నంగా నిరసన తెలిపాయి. కర్నూలు జిల్లా కోడుమూరులో తెదేపా, వామపక్షాల నేతలు కలిసి ఆందోళనలు చేపట్టారు.