ప్రధాని మోదీకి ప్రత్యేకహోదా నిరసన తెలుపుదాం – సీఎం చంద్రబాబు

0
51
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
రేపు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ నిరసన ద్వారా మన సత్తా ఏమిటో చూపిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.మోదీ పర్యటనకు సందర్భంగా రేపు ‘నిరసన దినం’ పాటిద్దామని ఆయన ఆదేశిం చారు.

శనివారం పార్టీ నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బీజేపీ ద్రోహానికి నిరసనగా ర్యాలీలు నిర్వహించాలని అన్నారు. పుండు మీద కారం జల్లడానికే మోదీ ఏపీకి వస్తున్నారని విమర్శించారు. చేసిన దుర్మార్గం చూసేందుకు వస్తున్నాడని ఇక్కడున్న దుర్మార్గుడు సహకరిస్తున్నాడని సీఎం దుయ్యబట్టారు.

మోదీ ద్రోహంపై జగన్ ఒక్కమాట అనడని, బీజేపీ, వైసీపీ కుమ్మక్కుకు అదే రుజువని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల్ని అస్థిర పర చాలని కుట్ర పన్నారని ఆరోపించారు. మొన్న బెంగాల్‌లో చేశారు రేపు తమ దగ్గరా చేస్తారని అన్నారు.