పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డుప్రమాదం – ఇరువురు మృతి

0
31
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – పశ్చిమ గోదావరి
పశ్చిమగోదావరి జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఇరువురు మృతిచెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పెద్దతాడేపల్లి జాతీయ రహదారి ఈ ప్రమాదం సంభవించింది. అతి వేగంతో ప్రయాణిస్తున్న కారు హైవే పక్కన ఉన్న రైలింగ్‌ను ఢీకొట్టింది. ఇనుపరేకులు మెడలోకి చొచ్చుకుపోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.వివరాలు వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌లో జూనియర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వారపరెడ్డి శ్రీనివాస్‌ అతని భార్య అన్నపూర్ణ(50), మనవడు ఆరుష్‌(1) ని తీసుకుని కృష్ణా జిల్లా గుంటుమిల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవింగ్‌ చేస్తున్న శ్రీనివాస్‌కు స్వల్ప గాయాలు కాగా, అతని భార్య, మనవడు మృతి చెందారు.

నిద్రమత్తులో వాహనాన్ని నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అదే ఆసుపత్రిలో గాయపడిన శ్రీనివాస్‌కు చికిత్స అందిస్తున్నారు.