తన రికార్డును తానే తిరగరాసిన సాయి పల్లవి

0
67
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – సినిమా డెస్క్‌
నటనతోపాటు, విలలక్షణమైన డ్యాన్సులతో అనతికాంలోనే విశేషమైన అభిమానులను సొంతం చేసుకుంది నటి సాయి పల్లవి. ఆమె తాజాగా మరో రికార్డును సృష్టించింది.సాయి పల్లవి వీడియో సాంగ్‌లు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తుంటాయన్న సంగతి తెలిసిందే.

ఫిదాలోని ‘వచ్చిండే’ సాంగ్‌ ఒకప్పుడు రికార్డులు సృష్టిస్తే ప్రస్తుతం ‘రౌడీ బేబీ’ సాంగ్‌ యూట్యూబ్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.మొన్నటి వరకు సౌత్‌ ఇండియాలో అత్యధిక మంది వీక్షించిన వీడియో సాంగ్‌గా టాప్‌లో నిలిచిన వచ్చిండే సాంగ్‌ను చాలా తక్కువ టైమ్‌లో రౌడీ బేబీ వెనక్కి నెట్టేసింది.

రెండింట్లోనూ సాయి పల్లవి తన మార్క్‌తో అలరించింది. వచ్చిండే సాంగ్‌తో ట్రెండ్‌సెట్‌ చేసిన సాయి పల్లవి రౌడీ బేబీతో తన రికార్డును తానే బద్దలుకొట్టింది. ఇప్పటికీ రౌడీ బేబీ వీడియోసాంగ్‌ను 183మిలియన్ల (దాదాపు 18కోట్లు) మంది వీక్షించా రు.