హోరాహోరీ పోరులో కివీస్‌ మహిళా జట్టు విజయం

0
20
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
హోరాహోరీగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌పై న్యూజిలాండ్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ముందు బ్యాటింగ్‌ చేసిన భారత మహిళా జట్టు ఓపెనర్‌ రోడ్రిగ్స్‌ (71 పరు గులు 6 ఫోర్లు, ఒక సిక్సర్‌), స్మృతి మంధానా (36 పరుగులు 3 ఫోర్లు, ఒక సిక్సర్‌) రాణించడంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు సాధించింది.

వీరిద్దరూ మినహా మిగిలిన వారు విఫలమవడంతో భారత్‌ అనుకున్న స్కోరు సాధించలేకపోయింది. 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ ఓపెనర్‌ సుజీ బేట్స్‌ (62 పరుగులు 5 ఫోర్లు), షెటర్త్‌వైట్‌ (23 పరుగులు 3 ఫోర్లు) రాణించారు. చివరి ఓవర్లో 9 పరుగులు కావాల్సిన తరుణంలో మన్సీ జోషి బౌలింగ్‌కు దిగింది.

తొలి బంతికి బౌండరీకి తరలించిన మార్టిన్‌ రెండో బంతికి అవుట్‌ కావడంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. చివరి 4 బంతుల్లో 5 పరుగులు చేయాల్సి ఉండగా 3వ బంతికి రెండు పరుగులు వచ్చాయి. చివరి మూడు బంతులకు మూడు పరుగులు రావ డంతో కివీస్‌ ఉత్కంఠ విజయం సాధించింది. సుజీ బేట్స్‌ ఉమెన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఎంపికైంది.